మంగళవారం 26 జనవరి 2021
Jangaon - Dec 05, 2020 , 02:18:59

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

  • మీర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయంతో ఆనందం
  • మంత్రి ఎర్రబెల్లి కృషి ఫలించిందని నాయకులు, కార్యకర్తల హర్షం

పాలకుర్తి/దేవరుప్పుల/కొడకండ్ల, డిసెంబర్‌ 4 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయంతో పార్టీ శ్రేణులు పాలకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం సంబురాలు జరుపుకున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం నిర్వహించిన హైదరాబాద్‌లోని మీర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జేరిపోతుల ప్రభుదాస్‌ ఘన విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పాలకుర్తిలో పటాకా లు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి. జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పుస్కూరి శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూని నవీన్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ బొబ్బల అశోక్‌రెడ్డి, జిల్లా, మండల కో-ఆప్షన్‌ సభ్యులు ఎండీ మదార్‌, సర్వర్‌ఖాన్‌, నాయకులు అబ్బాస్‌అలీ, గజ్జి సంతోశ్‌కుమార్‌, జీడి సమ్మయ్య  తదితరులు పాల్గొన్నారు. దేవరుప్పులలో నిర్వహించిన సంబురాల్లో టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు బస్వ మల్లేష్‌, యూత్‌ మండల అధ్యక్షుడు చింత రవి, భిక్షపతి, శ్రీనివాసరెడ్డి, కుతాటి నర్సింహులు, రమేశ్‌, సోమనర్సయ్య, సాయిలు, కృష్ణమూర్తి, సతీశ్‌, హనుమంతు, చింత సోమయ్య, చిరంజీవి, పరశురాములు, గుండె రమేశ్‌, మహేందర్‌ పాల్గొన్నారు. కొడకండ్లలో నిర్వహించిన సంబురాల్లో మార్కెట్‌ చైర్మన్‌ పేరం రాము, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె యాకయ్య, కోటగిరి కుమార్‌, మంగ్యా, అందె అశోక్‌, రామస్వామి పాల్గొన్నారు. 

కాప్రాలో విజయంతో సంబురాలు

నర్మెట : గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వర్ణరాజ్‌ భారీ మెజార్టీతో గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబురాలు జరిపాయి. కాప్రా ఇన్‌చార్జి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మండలంలోని దొడ్లగడ్డతండాలో ఓ వివాహ వేడుకకు హాజరైన ముత్తిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం భాగ్యనగరమని అన్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుగా నిలిచిన కాప్రా డివిజన్‌ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెద్ది రాజిరెడ్డి, ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, జడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గడపురం శశిరథ్‌, నాయకులు పగడాల నర్సయ్య, ఇట్టబోయిన రమేశ్‌, రా వుల నరేందర్‌, నక్క ల రవి, చిలుప వీరే శం, తేజావత్‌ హే మ్లా, న రేశ్‌, లొంక శివ, గుమ్ముల అశో క్‌ తదితరులు పాల్గొన్నారు.  logo