మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Dec 03, 2020 , 02:07:01

ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డికి నివాళి

ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డికి నివాళి

జనగామ క్రైం, డిసెంబర్‌ 2 : మావోయిస్టు పార్టీ అగ్రనేత, దివంగత ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది 21 సంవత్సరాలైన నేపథ్యంలో ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జనగామలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి చిత్రపటానికి కుటుంబ సభ్యులుతోపాటు ఫౌండేషన్‌ అధ్యక్షురాలు స్రవంతి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఆమె మాట్లాడుతూ సంతోష్‌రెడ్డి తాను నమ్మి సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడారని, పీడిత ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సంతోష్‌రెడ్డి 21వ వర్ధంతి సందర్భంగా త్వరలో స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తామని స్రవంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ కార్యదర్శి ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo