అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

- జిల్లా కలెక్టర్ నిఖిల
- సిద్దెంకిలో అభివృద్ధి పనుల పరిశీలన
జనగామ రూరల్, డిసెంబర్ 2 : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ‘పల్లెప్రగతి’లో భాగంగా బుధవారం మండలంలోని సిద్దెంకి గ్రామంలో చేపట్టిన రైతు కల్లాలు, పల్లె ప్రకృతివనం, తడి, పొడి చెత్త డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక పనులను ఆమె పరిశీలించారు. నిఖిల మాట్లాడుతూ పనుల వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోగా మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నర్సరీలోని మొక్కలను అవసరమైన ప్రాంతాల్లో నాటించాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు బాగున్నాయని ఆమె తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చూడాలని నిఖిల ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో బిరుదు హిమబిందు, సర్పంచ్ సుంకరి నిర్మల, మండల ప్రత్యేక అధికారి శంకర్ రావు, ఏఈవో సౌజన్య, ఏపీవో భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఉపేందర్‌రెడ్డి, కారోబార్ బాల్ నర్సయ్య, వార్డు సభ్యులు అలివేలు, స్వప్న, సుగుణ, బోళ్ల అంజయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
తరిగొప్పుల(నర్మెట): గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి అన్నారు. బుధవారం తరిగొప్పుల మండలంలోని అంకుషాపురం, పోతారం, అక్కరాజుపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతివనం, గ్రామానికో నర్సరీ, శ్మశానవాటికల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అక్కరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు 90 శాతం మేర పూర్తయ్యాయన్నారు. మిగతా గ్రామాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల కార్యదర్శులను శ్రీపతి కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, రవీందర్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
- గుడిపల్లిలో దారుణం.. తల్లిని చంపిన తనయుడు
- రఫేల్ జెట్ : దేనికైనా రెడీ