శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Dec 02, 2020 , 06:17:23

ట్రాక్టర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు

ట్రాక్టర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు

జనగామ క్రైం : జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్డు మార్గంలోని దత్తంపేట నగర్‌ సమీపంలో గత నెల 25న అజాగ్రత్తగా ట్రాక్టర్‌ నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్‌ తెలిపారు. జనగామ నుంచి లింగాల ఘణపురం మండలంలోని నాగారం గ్రామానికి చెందిన వెంకటయ్య టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై వెళుతుండగా అదే గ్రామానికి చెందిన గొరిగె రాజు ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంతో వెంకటయ్యను దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అతడి కుమారుడు దండు రాజు ఫిర్యాదు మేరకు గొరిగె రాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

VIDEOS

logo