శుక్రవారం 15 జనవరి 2021
Jangaon - Nov 30, 2020 , 05:57:21

పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు

 పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు

జఫర్‌గడ్‌: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లో 44 మందికి, కూనూరులోని పీహెచ్‌సీలో 20 మందికి ఆదివారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు  రాజు, భజన్‌లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 64 మందికి పరీక్షలు చేయగా వారందరికీ నెగిటివ్‌ రిపోట్లు వచ్చినట్లు తెలిపారు. 

బచ్చన్నపేట పీహెచ్‌సీలో..

బచ్చన్నపేట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ప్రతి రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని మండల వైద్యాధికారి కర్రె నవీన్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పీహెచ్‌సీలో కరోనా  పరీక్షలు చేస్తామన్నారు. ఆయన వెంట డాక్టర్‌ సిద్ధార్థరెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.