శనివారం 16 జనవరి 2021
Jangaon - Nov 28, 2020 , 03:23:31

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో

 అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో

జనగామ రూరల్‌, నవంబర్‌ 27: ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీడీవో బిరుదు హిమబిందు శుక్రవారం పరిశీలించారు. మండలంలోని పెద్దతండా(వై), ఎర్రగొల్లపహాడ్‌, గానుగుపహాడ్‌, చౌడారం, చీటాకోడూరు, మరిగడి, పెద్దతండా(ఎం) గ్రామాల్లో నర్సరీలు, శ్మశాన వాటిక, తడిపొడి చెత్త, కల్లాలు, పల్లె ప్రకృతివనాలతో ఉపాధిహామీ పనులను ఆమె పరిశీలించారు. హిమబిందు మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయడం కోసం మట్టిని కవర్లలో నింపే పనులు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అమ లు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తేజావత్‌ కల్యాణి వినోద్‌, వంగల రేణుకాశంకర్‌, సానబోయిన శ్రీ నివాస్‌, కొత్త దీపక్‌రెడ్డి, రా జయ్య, లచ్చిరాంనాయక్‌, రజి త, ఈసీ మాధవరెడ్డి, పంచాయ తీ కార్యదర్శులు దిలీప్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.