శనివారం 23 జనవరి 2021
Jangaon - Nov 27, 2020 , 02:56:58

వ్యక్తిత్వ వికాసానికి ఎన్‌సీసీ దోహదం

వ్యక్తిత్వ వికాసానికి ఎన్‌సీసీ దోహదం

నెహ్రూపార్క్‌, నవంబర్‌ 26 : విద్యార్దుల్లో వ్యక్తిత్వాన్ని, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఎన్‌సీసీ దోహదపడుతుందని, ఇందుకోసం రా బోయే రోజుల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని మైనారిటీ రెసిడెన్సియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను గురువారం ఎన్‌సీసీ అధికారులు సందర్శించారు. ఎన్‌సీసీ క్యాంపు నిర్వహణ కోసం  ఇక్కడి సదుపాయాలను పరిశీలించారని వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ వరంగల్‌ 10 బెటాలియన్‌ సుబేదార్‌ పీకే మహ్మద్‌, మదార్‌, శ్రీనివాస్‌, మైనారిటి కళాశాల ప్రిన్సిపాల్‌ అనిల్‌బాబు, పీఈటీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo