తరిగొప్పులలో గుప్తనిధులు..?

- లంకెబిందెలు దొరికాయంటూ ప్రచారం
- జంతుబలిచ్చిన ప్రాంతాన్ని సందర్శించిన తహసీల్దార్
- విచారణ చేయాలని పోలీసులకు ఆదేశం
తరిగొప్పుల(నర్మెట) : తరిగొప్పుల మండలకేంద్రంలో గుప్తనిధుల ప్రచారం జోరుగా సాగుతున్నది. స్థానికులు కొందరికి బంగారం లంకెబిందెలు దొరికాయనే పుకార్లు వారం రోజులుగా షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నది. పంపకా ల్లో సయోధ్య కుదరకపోవడంతో ఈ వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. వారి పంచాయితీ ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరింది. స్థానిక పోలీసులు, తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వాలని వారిని అక్కడి నుంచి పంపినట్లు సర్పంచ్ ప్రభుదాస్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ పరీదొద్దీన్ లంకెబిందె దొరికిందంటూ ప్రచారవుతున్న స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఆయన కథనం ప్రకారం.. తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 21న(శనివారం) మధ్యాహ్నం ఉపాధి పనుల నిమిత్తం వెళ్తుండగా గ్రామ శివారులో అతడికి కొప్పెర రూపం లో ఉన్న బిందె కనిపించింది. దాంట్లో ఏముందోనని భయపడి దానిని పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. ఈ విషయాన్ని అక్కడే ఉపాధి పని చేస్తున్న కొం దరికి తెలియజేశాడు. వారు అదే రోజు రాత్రి అక్కడ జంతుబలి ఇచ్చి దానిని తీసుకెళ్లారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు.
పంపకాల్లో వివాదం
లంకెబిందెలో ఉన్న నిధుల పంపకాల్లో ఐదుగురి మధ్య వివాదం చోటు చేసుకోవడంతోనే విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తున్నది. గతంలో ఇదే ప్రదేశంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ విషయమై ఎస్సై హారికను వివరణ కోరగా.. ఐదుగురు వ్యక్తులను విచారించి తహసీల్దార్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది