ఆదివారం 17 జనవరి 2021
Jangaon - Nov 26, 2020 , 02:07:01

‘స్వచ్ఛ జనగామ’లో ప్రజలను భాగస్వాములు చేయాలి

‘స్వచ్ఛ జనగామ’లో ప్రజలను భాగస్వాములు చేయాలి

  • వార్డుల పరిశీలనలో అదనపు కలెక్టర్‌  హమీద్‌ 

జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్‌ 25 : జిల్లా కేంద్రంగా మారిన జనగామ పట్టణాన్ని ‘స్వచ్ఛ జనగామ’గా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 1, 2వ వార్డు ల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య, కమిషనర్‌ సమ్మ య్య, వార్డు కౌన్సిలర్లు వాంకుడోత్‌ అనిత, రామగల్ల అరుణతో కలిసి పారిశుధ్య నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. కాలనీల్లో పర్యటించిన హమీద్‌ ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ సిబ్బందికి ప్రజలు సహకరించినప్పుడే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పట్టణంగా రూపుదిద్దుకుంటుందన్నారు. చెత్తను వేరుచేసి అధికారులు అందించిన ప్లాస్టిక్‌ బుట్టల్లో సిబ్బందికి అందజేయాలని ఆయన ప్రజలను కోరారు. రోడ్లపై, మురికికాలువల్లో చెత్తాచెదారం వేయడంతో అపరిశుభ్రత నెలకొంటున్నదన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.

చెత్త సేకరణలో చిత్తశుద్ధితో పనిచేయాలి

 చెత్త సేకరణ, తరలింపులో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ కోరారు. అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షించి జనగామను సుందర పట్టణంగా మార్చాలని ఆయన అన్నారు.