శనివారం 16 జనవరి 2021
Jangaon - Nov 25, 2020 , 06:47:38

నేటి నుంచి పెదమడూరులో శివకల్యాణోత్సవాలు

 నేటి నుంచి పెదమడూరులో శివకల్యాణోత్సవాలు

దేవరుప్పుల, నవంబర్‌ 24 : మండలంలోని పెదమడూరులో ఈ నెల 25, 26 తేదీల్లో శివకల్యాణోత్సవాలు, జాతర నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు మాన్యపు సిద్ధ్దేశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో శ్రీనాగేషం మహదేవస్వామి కల్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయని చెప్పారు. బుధవారం ఉదయం 8 గంటలకు క్షీరాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాత్రి ఆకాశదీపోత్సవం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు శివపార్వతుల కల్యాణం, స్వామి వారి సేవతో శోభాయాత్ర ఉంటాయన్నారు.