ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 23, 2020 , 01:51:36

దళారులను నియంత్రించేందుకే కొనుగోలు కేంద్రాలు

దళారులను నియంత్రించేందుకే కొనుగోలు కేంద్రాలు

  • అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

జనగామ రూరల్‌, నవంబర్‌ 22 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించడంతోపాటు దళారులను నిరోధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఆదివారం మండలంలోని పెద్దపహాడ్‌, చీటకోడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని భాస్కర్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రవీందర్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo