బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 23, 2020 , 01:51:33

ప్రఖ్యాత రచయిత్రి గంగరాజు సుశీలాదేవి మృతి

ప్రఖ్యాత రచయిత్రి గంగరాజు సుశీలాదేవి మృతి

  • బాలసాహితీవేత్తగా..  రేడియో అక్కయ్యగా కీర్తి

జనగామ, నమస్తే తెలంగాణ : ప్రఖ్యాత రచయిత్రి, బాలసాహితీవేత్త, రేడియో అక్కయ్యగా కీర్తి గడించిన గంగరాజు సుశీలాదేవి(81) ఆదివారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో 1939లోజన్మించిన ఆమె జనగామ మండలం సిద్దెం గ్రామంలో చాలాకాలం నివసించారు. సుశీలాదేవి చిట్టిముత్యాలు(బాలగేయ సంపుటి), ఆర్థ్ర హృదయం(కవితా సంపుటి) రచనలతో పాటు అనేక కవితలు, పిల్లల నాటికలు, గేయాలు, సంగీత రూపకాలు ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసారమయ్యాయి. 50ఏళ్ల క్రితమే బాలగేయాలు రాసి వినిపించడంతో ఆమె రేడియో అక్కయ్యగా తెలుగు ప్రజలకు పరిచయమై జనగామ కీర్తి వెలుగొందేలా చేశారు. సాహితీలోకానికి చేసిన సేవలకు గాను 2017లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సుశీలమ్మను అప్పటి జనగామ కలెక్టర్‌ దేవసేన ఘనంగా సన్మానించారు. కాగా, సుశీలమ్మ మృతిపై జిల్లాలోని సాహితీవేత్తలు, రచయితలు, కవులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సాహితీలోకానికి తీరని లోటని సంతాపం ప్రకటించారు.


VIDEOS

logo