శనివారం 28 నవంబర్ 2020
Jangaon - Nov 22, 2020 , 02:15:58

ఓటరు జాబితా సవరణ కేంద్రం పరిశీలన

ఓటరు జాబితా సవరణ కేంద్రం పరిశీలన

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : మండల కేంద్రంలోని శివునిపల్లి ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు జాబితా సవరణ కేం ద్రాన్ని శనివారం జనగామ జిల్లా కలెక్టర్‌ నిఖిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు పోలింగ్‌ స్టేషన్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్లు ఓటరు జాబితాను పరిశీలించి ఏమైనా సవరణలుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరుగా నమోదు కాకపోతే ఫారం-6 ద్వారా, తప్పులుంటే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీ జయచందర్‌, వీఆర్వో హరిత, బూత్‌లెవల్‌ ఆఫీసర్‌ వేణు పాల్గొన్నారు.