గురువారం 03 డిసెంబర్ 2020
Jangaon - Nov 22, 2020 , 01:37:46

29న క్షీరగిరి క్షేత్రంలో అఖండజ్యోతి

29న క్షీరగిరి క్షేత్రంలో అఖండజ్యోతి

  •  మంత్రి ఎర్రబెల్లిని  ఆహ్వానించిన అర్చకులు

పాలకుర్తి: పాలకుర్తి స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం(క్షీరగిరి క్షేత్రం)లో ఈ నెల 29న అఖండజ్యోతి, లక్షదీపోత్సవ కార్యక్ర మం నిర్వహించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఈవో వీరస్వామి, తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, అర్చకులతో కలిసి శనివారం ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఆయనను కలిసి పత్రికను అందజేశారు. ఈ మాసంలో హరిహరు లు అఖండ జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వనున్నట్లు, క్షీరగిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ చుక్కా రామయ్యను హైదరాబాద్‌లో  కలిసి అఖండజ్యోతిని తిలకించేందుకు హాజరుకావాలని కోరారు. వారి వెంట ప్రధాన అర్చకులు దేవగిరి రామన్న, సూపరింటెండెంట్‌ వెంకటయ్య ఉన్నారు.


Previous Article భూమి పూజ