ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 21, 2020 , 02:28:07

వార్డుల్లో మౌలిక వసతులకు కృషి

వార్డుల్లో మౌలిక వసతులకు కృషి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున


నెహ్రూపార్క్‌, నవంబర్‌ 20 : జనగామ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జము న అన్నారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డులో స్టేట్‌ ఫైనాన్స్‌ నిధుల నుంచి రూ.5 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులకు స్థానిక వార్డు కౌన్సిలర్‌ పేర్నె స్వరూపతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. జమున మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనాపై జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆమె సూచి ంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కమిషనర్‌ సమ్మయ్య, ఫ్లోర్‌ లీడర్‌ సురేశ్‌రెడ్డి, కొ మురవెళ్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగ య్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరి రెడ్డి, కౌన్సిలర్లు జూకంటి లక్ష్మి, పాక రమ, గుర్రం భూలక్ష్మి, కర్రె శ్రీనివాస్‌, ముస్త్యాల దయాకర్‌, నాయకులు సేవెల్లి మధు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo