సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 21, 2020 , 02:23:41

నేడు, రేపు ఓటరు జాబితా సవరణ : కలెక్టర్‌

నేడు, రేపు ఓటరు జాబితా సవరణ : కలెక్టర్‌

నెహ్రూపార్క్‌, నవంబర్‌ 20 : నూతన ఓటర్ల జాబితా సవరణ-2021లో భాగంగా శని, ఆదివారాల్లో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన చేశారు. ఓటరు జాబితాను పరిశీలించి అందులో ఏమైనా సవరణలుంటే దరఖాస్తు చేయాలని సూచించారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల వద్దనున్న ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా ? అని అడిగి తెలుసుకోవాలన్నారు. ఓటరుగా పేరు నమోదు కానట్లయితే ఫారం-6 ద్వారా, తప్పులున్నట్లయితే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిఖిల కోరారు.

VIDEOS

logo