సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 20, 2020 , 02:59:26

కస్టం హైరింగ్‌ సెంటర్‌పై అవగాహన

కస్టం హైరింగ్‌ సెంటర్‌పై అవగాహన

దేవరుప్పుల : సీతారాంపురంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన కస్టం హైరింగ్‌ సెంటర్‌పై క్లస్టర్‌ పరధిలోని గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులకు గురువారం అవగాహన కల్పించారు. అడిషనల్‌ డీఆర్‌డీవో నూరొద్దీన్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగగా సీతారాంపురం, ధర్మగడ్డ తండా, కామారెడ్డిగూడెం సర్పంచులు రమేశ్‌, సునీత, అంజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌డీవో మాట్లాడారు. సీతారాంపురం క్లస్టర్‌గా కామారెడ్డిగూడెం, ధర్మగడ్డ తండా, కడవెండి గ్రామాల మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.27 లక్షలతో వ్యవసాయానికి ఉచితంగా ఆధునిక పరికరాలు అందించిందన్నారు.

వాటిని రైతులకు కిరాయికి ఇచ్చి అద్దె వసూలు చేయాలని నిర్దేశించిందని తెలిపారు. క్లస్టర్‌ పరిధిలోని గ్రామైఖ్య సంఘాలు సమావేశమై అద్దె నిర్ణయించి రైతులకు అందించాలన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు అందించే పరికరాల కంటే అద్దె తక్కువగా ఉండాలని సూచించారు. రైతులు, ట్రాక్టర్‌ ఓనర్లు, ప్రజాప్రతినిధులు సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం సుజాత, ఏపీఎం సురేందర్‌, రైతు బంధు కడవెండి గ్రామ కో ఆర్డినేటర్‌ లీనారెడ్డి, గ్రామైఖ్య సంఘాల ప్రతినిధి చందన, మండల సమాఖ్య అధ్యక్షురాలు స్పప్న, కార్యదర్శి సావిత్రి, శారద,  అనిత, సీఏలు శిరీష, సోమలక్ష్మి, సీహెచ్‌సీ మేనేజర్‌ హైమ ఉన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo