గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 19, 2020 , 02:50:03

పార్కులను తలపిస్తున్న ప్రకృతి వనాలు

పార్కులను తలపిస్తున్న ప్రకృతి వనాలు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

బచ్చన్నపేట : గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు పట్టణ పార్కులను తలపిస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని గోపాల్‌నగర్‌లో పల్లెప్రకృతి వనం, నాగిరెడ్డిపల్లిలో డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా, లింగంపల్లిలో రైతువేదిక, ఆగ్రోస్‌ కేంద్రాన్ని రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ నాగజ్యోతికృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బచ్చన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పా టు చేసిన పల్లెప్రకృతి వనాలు జిల్లాలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సర్పంచులు పో టాపోటీగా పార్కుల డిజైన్లు చేస్తున్నారన్నారు. పట్నం తరహాలో పార్కులను తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స ర్పంచులు, ఎంపీటీసీలు మధుప్రసాద్‌, తాతిరెడ్డి భవానీశశిధర్‌రెడ్డి, ఎంపీటీసీ చల్లా సక్కుబాయి, మల్లేశం, మంజులామల్లేశం, అరుణాఅయిలయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫో రం మండల అధ్యక్షుడు కనుకయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, నాయకులు బావండ్ల కృష్ణంరా జు, గిరబోయిన అంజయ్య, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, నరెడ్ల బాల్‌రెడ్డి,  గోవర్దన్‌రెడ్డి,  గోపాల్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, ప్రభాకర్‌, రాములు, లతాశ్రీతిరుపతిగౌడ్‌, నరేందర్‌, మద్దికుంట రాధ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo