ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 18, 2020 , 01:48:52

రైతుల అభ్యున్నతే సీఎం ధ్యేయం

రైతుల అభ్యున్నతే సీఎం ధ్యేయం

ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌/లింగాల ఘనపురం, నవంబర్‌ 17 : రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య అన్నారు. మండల కేంద్రంలోని శివునిపల్లిలో ధాన్యం కొను గో లు కేంద్రాన్ని, లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సీజన్‌లో 369 మంది రైతుల నుంచి 1400 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఓడీసీఎంఎస్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేయడంతోపాటు నియంత్రిత సాగుకు ఆదేశాలిచ్చారని చెప్పారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించేలా రైతువేదికలను నిర్మిస్తున్నారని రాజయ్య వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పార్సి కృష్ణారావు, పార్సి కమల్‌కుమార్‌, జొన్నల సోమన్న, గోలి రాజశేఖర్‌, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, వ్యవసాయశాఖ ఏడీఏ ప్రదీప్‌కుమార్‌, ఈవో వెంకటకిశోర్‌, సర్పంచ్‌ల ఫోరం మం డల అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ఎంపీటీసీలు బూర్ల లత, రాజు, పీఏసీఎస్‌ చైర్మ న్‌ దూదిపాల నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, పట్టణ అధ్యక్షుడు బైరి బాలరాజు, బూర్ల శంకర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు తోట రజిత, తోట సత్యం, గట్టు మనోహర్‌బాబు, నాయకులు డాక్టర్‌ రమేశ్‌, డాక్టర్‌ ఉమాశంకర్‌, గుర్రం యేసుబాబు, బైరి నాగరాజు, ఓడీసీఎంఎస్‌ కేంద్రం ఇన్‌చార్జి ఐయిత సంతోశ్‌, ఐత లింగయ్య పాల్గొన్నారు.  నెల్లుట్లలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్‌, ఆకుల కుమార్‌, దూసరి గణపతి, బోయిని రాజు,దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, నాయకులు రుషిగంపల ఉపేందర్‌గౌడ్‌, మల్గ శ్రీశైలం, గంగాధర్‌, గండి యాదగిరి, దయ్యాల గణేశ్‌, కొండేటి మల్లారెడ్డి, బూడిద జయరాజేశ్వర్‌గౌడ్‌, ఆగిరెడ్డి, కోతి రాములమ్మ  ,రాంచందర్‌,నల్ల మైసయ్య, గట్టగల్ల శ్రీహరి, మార్కెట్‌ కార్యదర్శి జీవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo