జనగామ మార్కెట్లో దీపావళి పూజలు

జనగామ, నమస్తేతెలంగాణ, నవంబర్ 16 : జనగా మ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం దీపావళి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఏటా దీపావళి తర్వాత మార్కెట్ ప్రధాన కార్యాల యం లో లక్ష్మీపూజ నిర్వహించి, కొత్త ఖాతా పుస్తకాలకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా బాణాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సిద్ధాంతి వేద మంత్రాలతో పూజ నిర్వహించిన అనంతరం నూతన ఖాతా పుస్తకాలు, పెన్నులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమీషన్ ఏజెంట్ మోహన్‌లాల్ హరికిషన్ వేలం ద్వారా బిక్కు నాయక్
అనే రైతు నుంచి ధాన్యం క్వింటాల్‌కు రూ.1616కు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, మార్కెటింగ్‌శాఖ జిల్లా మేనేజర్ నాగేశ్వరశర్మ, మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీ జీవన్‌కుమార్, పజ్జూరి జయహరి, అడ్తీ అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, వ్యాపారులు ద్వారకాదాస్ బజాజ్, మాశెట్టి అశోక్, బచ్చు రమేశ్, దాస ఉపేందర్, నాగబండి రవీందర్, జిన్నింగ్ మిల్లు ప్రతినిధులు ఎడమ సంజీవరెడ్డి, అజీజ్, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధి కానుగంటి ముత్తయ్య, సీసీఐ ప్రతినిధి తిరుమల్ రావు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో దడువాయి యూనియన్ ఆధ్వర్యంలో లక్ష్మీపూజలు నిర్వహించారు.
తాజావార్తలు
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం
- సైనిక స్థావరంలో భారీపేలుడు.. 20 మంది మృతి
- ప్రకటన పెట్టి.. బోల్తా కొట్టిస్తారు
- మొదటి భార్య వేధిస్తుంది.. పుట్టింటికి పంపించండి