రూ.36 కోట్లతో డబుల్ రోడ్లు

- నైజాం కాలంలో అంచనాలు..
- కేసీఆర్ జమానాలో మంజూరు
- నేడు శంకుస్థాపన చేయనున్న
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేవరుప్పుల : సమైక్య రాష్ట్రంలో పట్టించుకునేవారు లేక గ్రామీణ ప్రాంతాల రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. విస్తరణ కు నోచుకోలేదు. మండలాలు, జిల్లా కేం ద్రాలకు రాకపోకలు సాగించడానికి తం డాలు, మారుమూల గ్రామాల ప్రజలు నానాఇబ్బందులు పడ్డారు. కానీ, స్వరాష్ట్రంలో ఆ బాధలు తీరాయి. సీఎం కేసీఆర్ రోడ్ల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాలు, తండాల నుం చి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు తారురోడ్లు వేయిస్తున్నారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవరుప్పుల మండలకేంద్రంగా గూడూరు- ధర్మాపురం, విస్నూరు- దేవరుప్పుల, సింగరాజుపల్లి-జీడికల్లుకు డబుల్రోడ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం రూ.36కోట్ల నిధులు విడుదల చేసింది. మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నాయి. నిజానికి ఈ రోడ్ల ప్రాధాన్యతను నిజాం సర్కారు అప్పట్లోనే గుర్తించింది. సర్వే పూర్తి చేయించి అంచనాలు తయారు చేసింది. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో నాటి సమైక్య పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వాటి దుమ్ము దులిపి కొత్త అంచనాలతో రోడ్లు మంజూరు చేయ డంతోపాటు నిధులు విడుదల చేశారు.
రోడ్ల ప్రాధాన్యం
సింగరాజుపల్లి- జీడికల్లును డబుల్ రోడ్డుగా విస్తరిస్తే ఈ దా రి మహబూబాబాద్-హైదరాబాద్‌ను కలిపే దగ్గరి దారి అవుతుందని గుర్తించిన ఆనాటి నిజాం ఇంజినీర్లు సర్వే పూర్తి చేసి రాళ్లు నాటారు. అవి నేటికీ ఉన్నాయి. ఈ రోడ్డు పొడవు 13.5 కిలోమీటర్లు ఉండగా, ప్రభుత్వం రూ. 11.49 కోట్లు మంజూరు చేసింది. ఇది పూర్తయితే ఆర్టీసీ బస్సులు మహ బూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఈ నుంచే వెళ్తాయి. మ రోవైపు దేవరుప్పుల మండలం నుంచి జీడికల్లు, యాదాద్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు దగ్గరి దారిగా అవుతుంది.
గూడూరు- దేవరుప్పుల..
గూడూరు నుంచి ధర్మాపురం వరకు 20 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం సింగిల్ రోడ్డే ఉంది. డబుల్ రోడ్డుగా విస్తరణ కోసం ప్రభుత్వం రూ.14.97కోట్లు మంజూరు చేసింది. ఇది పూర్తయితే హన్మకొండ- నల్లగొండ జిల్లాను కలిపే దగ్గరి దారి అవుతుంది. ఇప్పుడున్న రోడ్డుతో పోల్చితే సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హన్మకొండ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్, గూడూరు, దేవరుప్పల, మో త్కూరు, అమ్మనబోలు, నార్కట్‌పల్లి, నల్లగొండకు వెళ్లేం దుకు ఈ మార్గం అనువుగా ఉంటుంది.
విస్నూరు- దేవరుప్పుల..
నిజాం జమానాలో విస్నూరు ఫిర్కాగా ఉన్న కాలంలోనే విస్నూరు, ధర్మాపురం, దేవరుప్పుల రోడ్డు ప్రస్తావన ఉం ది. సింగిల్ బీటీ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు పొడవు 13.15 కిలోమీటర్లు. రూ.9.72కోట్లు మంజూరయ్యాయి. డబుల్ రోడ్డుగా విస్తరిస్తే పాలకుర్తి, దేవరుప్పుల మండలకేంద్రానికి రాకపోకలు సులువవుతాయి. పాలకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్లడానికి దగ్గరి దారి అవుతుంది.
ప్రాధాన్యతను గుర్తించే మంజూరు చేశాం..
నేను మొదటి సారిగా పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచినప్పుడే ఈ రోడ్ల ప్రాధాన్యం గుర్తించా. కొంత ఆలస్యమైనా నిధులు మంజూరై పనులు ప్రారంభానికి నోచుకోవడం సంతోషంగా ఉంది. అనేక గిరిజన తండాల ప్రజలకు ఈ రోడ్లు సౌకర్యవంతంగా ఉం టాయి. దేవరుప్పుల మండలానికి ప్రాధాన్యం పెరిగి కూడలిగా మారుతుంది.
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు