శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 16, 2020 , 06:42:20

తుది దశకు పార్టీ కార్యాలయ నిర్మాణాలు..

తుది దశకు పార్టీ కార్యాలయ నిర్మాణాలు..

  • త్వరలో కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం
  • జనగామలో నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో పార్టీ అధినేత కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన జనగామ శివారులోని యశ్వంతపూర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్‌, నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా భవన నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ త్వరలో పనులన్నీ పూర్తి చేయించి కార్యాలయాన్ని నాయకులు, కార్యకర్తలకు అందుబాటు లోకి తెస్తామన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ చలికాలం కారణంగా విజృంభించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునపటి కంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తేనే మహమ్మారిని అరికట్టవచ్చన్నారు. మంత్రి వెంట లింగాలఘనపురం మండల టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వంచ మనోహర్‌రెడ్డి ఉన్నారు. 

VIDEOS

logo