సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 16, 2020 , 06:42:25

ఘనంగా దీపాల పండుగ

ఘనంగా దీపాల పండుగ

  • జిల్లా వ్యాప్తంగా కాంతులీనిన వాకిళ్లు
  • ఇంటింటా పూజలు, వ్రతాలు
  • వినిపించని పటాకుల మోత
  • భక్తిశ్రద్ధలతో కేదారీశ్వర స్వామి వ్రతాలు

జనగామ, నమస్తేతెలంగాణ/ నర్మెట/ దేవరుప్పుల/ జనగామ రూరల్‌/ బచ్చన్నపేట, నవంబర్‌ 15 : దీపాల కాంతులు..పటాకుల మోతలు..ధనలక్ష్మీపూజలు..కేదారీశ్వర స్వామి నోములు..వ్రతాలతో ఇండ్లన్నీ సందడిగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా పటాకులు కాల్చి, సంబురాలు జరుపుకున్నారు. ఇండ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను రంగురంగుల పూల తో అందంగా అలంకరించారు. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో బాణాసంచా కాల్చడానికి కొద్దిసేపే కోర్టు అనుమతి ఇవ్వడంతో పటాకుల మోత తగ్గింది. ఆదివారం కేదారీశ్వరస్వామి వ్రతా లు జరుపుకున్నారు.  


VIDEOS

logo