Jangaon
- Nov 14, 2020 , 02:11:54
VIDEOS
పల్లెప్రగతి పనులు వేగవంతం చేయాలి

జనగామ రూరల్, నవం బర్ 13 : మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులు వేగవంతం చేయాలని ఎంపీవో ఉప్పుగల్లు సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సిద్దెంకి, వడ్లకొండ, చౌడా రం, చీటకోడూరు, ఎర్రకుంటతండా, ఓబుల్ కేశ్వాపూర్, పెద్దరాంచర్ల, ఎల్లంల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు పెంచడానికి బ్యాక్ ఫిల్లింగ్ పనులు వేగవంతంగా చేయాలని, పల్లె ప్రకృతి వనాల్లో ప్రతి రోజూ మొక్కలకు నీళ్లు పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సుంకరి నిర్మల, బొల్లం శారద, ముక్క రాజయ్య, కొత్త దీపక్ రెడ్డి, మంజుల, రేణుక, సుజాత, ఎంపీటీసీలు కొమ్ము సుజాత, బండ లక్ష్మి, మహేశ్వరి, ఏపీవో భిక్షపతి, పంచాయతీ కార్యదర్శులు ప్రపుల్ రెడ్డి, రాజు, సామ్రాజ్యం, శ్రీకాంత్, శివశంకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
MOST READ
TRENDING