గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 14, 2020 , 02:11:56

సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శివకుమార్‌

సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శివకుమార్‌

జనగామ రూరల్‌ నవంబర్‌13: సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రఘునాథపల్లి సర్పంచ్‌ పోకల శివకుమార్‌ ఎన్నికయ్యారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఫోరం జిల్లా ఉపాధ్యక్షులుగా గంగం సతీశ్‌రెడ్డి(బచ్చన్నపేట), వీరమనేని యాకాంతారావు(పాలకుర్తి) ప్రధాన కార్యదర్శిగా పసూనూరి మధుసూదన్‌(కొడకండ్ల), కార్యనిర్వహక కార్యదర్శిగా బొల్లం శారదస్వామి(జనగామ). కోశాధికారిగా దూసరి గణపతి (లింగాల ఘనపురం), అధికార ప్రతినిధి తాలికొండ సురేశ్‌ కుమార్‌(స్టేషన్‌ఘన్‌పూర్‌), కార్యవర్గ సభ్యులుగా ఆమెడపు కమలాకర్‌రెడ్డి(నర్మెట) గాదె ప్రవీణ్‌రెడ్డి (సాగరం), ఉద్దమాని రాజుకుమార్‌ (చిల్పూరు), కుర్నాల రవి (కోలుకొండ), భీరెడ్డి జాజిరెడ్డి (మరియపురం)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్‌, ఉపాధ్యక్షుడు యాకాం తారావు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు. 


VIDEOS

logo