గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 13, 2020 , 06:11:14

దేవాదుల పనులు త్వరగా పూర్తి చేయాలి

దేవాదుల పనులు త్వరగా పూర్తి చేయాలి

  •  కలెక్టర్‌ నిఖిల

నెహ్రూపార్క్‌ : దేవాదుల ప్రాజెక్ట్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిఖిల అధికారులను ఆదేశించా రు. కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ల్యాండ్‌ అక్విజేషన్‌ పనులపై చీఫ్‌ ఇంజినీర్‌ బంగారయ్య, వారి సిబ్బందితో యూనిట్‌-1, యూనిట్‌ -2 పరిధిలో దేవాదుల ప్రాజెక్ట్‌ పనులు త్వరగా పూర్తి చేయా లన్నారు. అదే విధంగా ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌, తపాసుపల్లి, చీటకోడురు పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద కాలువల నిర్మాణంలో సేకరించిన భూములపై ల్యాండ్‌ అక్విజేషన్‌ ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.  అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాలతి,  ఆర్డీవో మధుమోహన్‌, కలక్టరేట్‌ సూపరింటెండెంట్‌ మన్పూరి, తదితరులు ఉన్నారు


VIDEOS

logo