శుక్రవారం 22 జనవరి 2021
Jangaon - Nov 12, 2020 , 02:46:04

పంచాయతీ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలి

పంచాయతీ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలి

  • అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌

నర్మెట, నవంబర్‌ 11 : ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ పంచాయతీ కార్యదర్శులను కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పంచాయతీ కార్యదర్శి యాప్‌పై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హమీద్‌ మాట్లాడుతూ యాప్‌లో ప్రతి రోజూ నిర్దేశించిన పారిశుధ్యం, ఇతర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా పనులు జరిగేందుకు సంబంధిత పనుల వివరాలతో కూడిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని ఆయన సూచించారు. అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు, పనుల వివరాలు ఎంపీడీవో లాగిన్‌లోకి వెళ్తాయని అన్నారు. వీటిని మండల, జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సూచనలు చేస్తారని హమీద్‌ వివరించారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, ఎంపీడీవో ఖాజా నయీమొద్దీన్‌, ఎంపీవో గఫూర్‌  పాల్గొన్నారు

తరిగొప్పులలో..

తరిగొప్పుల(నర్మెట) : పారిశుధ్య పనుల్లో గ్రామ పం చాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అన్నా రు. పల్లెప్రగతి పంచాయతీ కా ర్యదర్శుల యాప్‌పై తరిగొప్పు ల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామా ల్లో పరిసరాల పరిశుభ్రత, మురుగు కా ల్వల క్లీనింగ్‌, ఇతర గ్రామ పం చాయతీ పనులను ఎప్పటికప్పుడు యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతి రోజూ నిర్దేశించిన పనులను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ జొన్నగోని హరిత సుదర్శన్‌గౌడ్‌, ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

‘పల్లెప్రగతిలో పారదర్శకత కోసం యాప్‌

బచ్చన్నపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిని మరింత పారదర్శకంగా నిర్వహిం చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించిందని జడ్పీ డిప్యూటీ సీఈవో వసంత అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీవో రఘురామకృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పంచా యతీ ఉద్యోగులు చేపట్టే పనులన్నీ అందులో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్య దర్శులు  రేవతి, భీమ్‌రాజ్‌, భరత్‌, భాను, రాజన్‌బాబు, రూప చైతన్య, రుబీనా, ప్ర శాంత్‌ ఆచార్య, రాజశేఖర్‌, కిరణ్‌, శ్రీనివాస్‌, సురేశ్‌, చారి, కళ్యా ణి, సతీశ్‌రెడ్డి, పరమేశ్వర్‌, కవిత, నరేశ్‌  పాల్గొన్నారు.. 


logo