శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 12, 2020 , 02:46:06

అబుల్‌ కలామ్‌ఆజాద్‌ జయంతి వేడుకలు

అబుల్‌ కలామ్‌ఆజాద్‌ జయంతి వేడుకలు

జనగామ క్రైం, నవంబర్‌ 11 : భారతరత్న మౌలానా అబుల్‌కలామ్‌ ఆజాద్‌ జయంతి వేడుకలను బుధవారం జనగామలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ బాలుర జూనియర్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం, మైనార్టీ నాయకుడు జమాల్‌ షరీఫ్‌ విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్‌ ఉచితంగా అందజేశారు. ఇదిలా ఉండగా స్కాలర్స్‌ గ్రామర్‌ స్కూల్‌ ఆవరణలో తెలంగాణ స్టేట్‌ మైనార్టీ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ, సాధిక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ మైనార్టీ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఖాజా ముజ్తాహిదొద్దీన్‌, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్‌ పోతు అనిల్‌బాబు మాట్లాడారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సాధిక్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సాధిక్‌ అలీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ ఫౌండేషన్‌ తరపున ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఖాజా ముజ్తాహిదొద్దీన్‌,  మైనార్టీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పోతు అనిల్‌ కుమార్‌, సాధిక్‌ ఫౌండేషన్‌ చెర్మన్‌ సాధిక్‌ అలీ, అంకుషావలీ, ఎండీ హఫీజ్‌, రెహమాన్‌, జలీల్‌, జమాలోద్దీన్‌, ఖుర్షీద్‌, హైమద్‌  పాల్గొన్నారు.


VIDEOS

logo