శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Nov 12, 2020 , 02:46:30

స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పూర్వవైభవం

స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పూర్వవైభవం

  •  వరంగల్‌పై సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ
  •  మెట్టుగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
  •  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి   అల్లోల  ఇంద్రకరణ్‌ రెడ్డి
  •  నగరంలో ధార్మిక భవన్‌కు భూమి పూజ
  •  పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,  సత్యవతిరాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం

మట్టెవాడ/మడికొండ, నవంబర్‌ 11: స్వరాష్ట్రంలోనే ఆల యాలకు పూర్వవైభవం వచ్చిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సెంట్రల్‌ జైల్‌ ఎదురుగా వరంగల్‌ డివిజన్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయ నిర్మాణానికి మంత్రులు ఎర్ర బెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం విన య్‌భాస్కర్‌, ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. మడికొండలోని మెట్టుగుట్ట రా మలింగేశ్వరుడి సన్నిధిలో దాత మాడిశెట్టి రాజేశ్‌కుమార్‌, జ్ఞానే శ్వరి దంపతులు రూ.65లక్షలతో నిర్మించిన నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు భద్రకాళీ అమ్మవా రిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రూ.1000 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారని, త్వరలో ప్రారం భించనున్నట్లు తెలిపారు. గతంలో రాజులు మాత్రమే రాతి శిల లతో నిర్మాణాలు చేపట్టే వారని, దేశంలో ఎక్కడ కూడా ప్రధా నులు, ముఖ్యమంత్రులు ఇలా దేవాలయాల నిర్మాణం చేప ట్టలేదని అన్నారు. వరంగల్‌ జోన్‌లో రూ. 6.53 కోట్లతో పలు ఆలయాలను పునరుద్ధరించినట్లు చెప్పారు. మంత్రుల కోరిక మేరకు రూ. 3 కోట్లతో వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాన్ని  నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో నిర్మాణం పూర్తవుతుందని, ఇందులో డీసీ, సమ్మక్క-సారలమ్మ ఆలయ కార్యాలయంతోపాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌పై సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందని,  ఇక్కడి కాక తీయుల ఆలయాలను తెలంగాణ ప్రభుత్వమే ఉన్నతీకరించి నట్లు ఆయన వివరించారు. గోదావరి, కృష్ణ పుష్కరాలను ఎం తో వైభవంగా నిర్వహించామని, రానున్న తుంగభద్ర పుష్కరా లను కూడా కొవిడ్‌ -19 నిబంధనల మేరకు నిర్వహిస్తామ న్నారు. మడికొండలోని మెట్టుగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక్కడ అక్షరాభ్యా సం కూడా చేసుకునేందుకు వీలుగా సౌకర్యాల కల్పనకు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గుట్టపై ఆహ్లాద వాతావరణం కల్పించేలా కృషి చేస్తానని చెప్పా రు. పోలీస్‌ సిగ్నల్‌ టవర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కనుమరుగైన ఆలయాలను సీఎం కేసీఆర్‌ నాయకత్వంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. తమ ప్రాంత మహిళలు స్వయంఉపాధి కింద ఉత్పత్తులు చేస్తు న్నారని, వారిని వివిధ ఆలయాల్లో విక్రయించేలా చూడాలని ఆయన మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, వరంగల్‌ అర్బ న్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు, రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణారావు, వరంగల్‌ జోన్‌ ఉపకమిషనర్‌ విజయరామారావు, మాజీ ఎంపీ గుండు సుధా రాణి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సునీత, కార్పొరేటర్లు యెలగం లీలావతి, జోరిక రమేశ్‌, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఈవో వీరస్వామి, మెట్టుగుట్ట మాజీ చైర్మన్‌ అల్లం శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ హరిరమాదేవి, రాచర్ల రాము, పరశురాములు, రాచర్ల జగన్‌, సూపర్‌ బజార్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ షఫీ, ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఊకంటి యాకూబ్‌రెడ్డి, దర్గా సొసైటీ చైర్మన్‌ ఊకంటి వనంరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, ఆ వాల రాధికానరోత్తంరెడ్డి, కుందూరు రాజేశ్‌ రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, బైరి కొమురయ్య, పేపర్‌ రవి, బొల్లికొండ వినో ద్‌, రాగిచేడు అభిలాష్‌ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యు లు, టక్కరి సత్యం, అనిల్‌, సంతోష్‌ పాల్గొన్నారు. 

భద్రకాళిని దర్శించుకున్న మంత్రులు

భద్రకాళి అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. మెట్టుగుట్ట స్వయం భూలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకా లు చేయించారు. సీతారామచం ద్ర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపిం చారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో పూజారులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

వనదేవతల పేరు పెట్టాలి

డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణానికి సమ్మ క్క-సారలమ్మ ప్రాంగణంగా నామకరణం చేయాలి. భద్ర కాళి అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో భక్తి, అందుకే అమ్మ వారికి బంగారు కిరీటం అందించారు. వేయి స్తంభాల ఆ లయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్ర భుత్వం వల్ల కొన్ని పనులు ఆగిపోయాయి. కరోనా సమ యంలోనూ ఎండోమెంట్‌ పనులు ముందుకు పోతున్నా యి. అందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 55 ఎకరా ల విశాలమైన మెట్టుగుట్టను అభివృ ద్ధి చేసేందుకు స్థలం, నిధులు ఉన్నాయి. మరో బాసరగా అభివృద్ధి చేస్తాం. 

- పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కార్యాలయ ఏర్పాటు సంతోషదాయకం

ఇక్కడ డీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతో షదాయకం. వనదేవతల పేర్లు పెట్టడంతోపాటు, ప్రజల ను భక్తి మార్గంతో నడిచేలా మ రిన్ని ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకంలో చేర్చాలి. మొదటిసారిగా మెట్టు గుట్ట దేవస్థానాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. మెట్టురామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటక  కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఉంది. 

- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ 

VIDEOS

logo