జిల్లా కేంద్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా

- బీటీ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ, నవంబర్ 8 : ఉమ్మడి జిల్లా ముఖద్వారామైన జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం బైపాస్ నుంచి హన్మకొండ రోడ్డులోని పాలకేంద్రం వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కరువు నేలపై వరుణుడు కురుణించడంతో సంతోషంగా ఉన్నా.. కొన్ని కాలనీలు జలమయం కావడం బాధాకరమన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ప్రధాన రహదారిపై వరదనీరు చేరకుండా, జ్యోతినగర్ జంక్షన్ సమీపంలో వరదనీరు రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రహదారులపై చేపట్టిన నిర్మాణాలతో పాటు వార్డుల పరిధిలో డ్రైజేజీ విస్తరణ పనులు చేపడితేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ముందుచూపు లేకుండా గతంలో చేపట్టిన డ్రైనేజీ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు పగిడిపాటి సుధా సుగుణాకర్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, నాయకులు జూకం టి శ్రీశైలం, గజ్జెల నర్సిరెడ్డి, మాశెట్టి వెంకన్న, కర్రె శ్రీనివాస్, నిమ్మతి మహేందర్‌రెడ్డి, మామిడాల రాజు, నీల రామ్మోహన్, మిద్దెపాక లెనిన్, నారోజు రామేశ్వరాచారి, బాల్దె వెంకటేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!