సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 08, 2020 , 03:25:08

జనగామ కోర్టులో లోక్‌ అదాలత్‌

జనగామ కోర్టులో లోక్‌ అదాలత్‌

నెహ్రూపార్క్‌, నవంబర్‌ 7 : హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం జనగామ కోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. దీనిని న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ ఉటుకూరు సత్యనారాయణ ప్రారంభించారు. లోక్‌అదాలత్‌లో 84 క్రిమినల్‌ కేసులు, 20 ఎక్సైజ్‌ కేసులు, రెండు మెయింటనెన్స్‌ కేసులను పరిష్కరించారు. ఎక్సైజ్‌ కేసుల్లో రూ.లక్షా 5 వేల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉమాదేవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. 

VIDEOS

logo