గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 07, 2020 , 04:53:34

సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం తనిఖీలు

సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం  తనిఖీలు

  • కాజీపేట రైల్వే జంక్షన్‌, జనగామ స్టేష న్‌లో పలువురు అధికారులపై ఆగ్రహం 

కాజీపేట/జనగామ క్రైం, నవంబర్‌ 6: కాజీపేట రైల్వే జంక్షన్‌, జనగామ స్టేషన్‌లో సికింద్రాబాద్‌ రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆనంద్‌ బాటియా శుక్రవారం తనిఖీలు చేస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ప్రత్యేక రైలులో ఆయన అధికారుల బృందంతో వచ్చారు. ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌, క్రూ కంట్రోల్‌, ప్లాట్‌ఫాం, బుకింగ్‌ కౌంటర్‌, పార్శిల్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్‌లో కొవిడ్‌ లక్షణాలు ఉన్న స్పెషల్‌ రైలు ప్రయాణికులను  గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్‌ను పరిశీలించారు. ఏ విధంగా పరీక్షలు చేస్తున్నారని, ఇంతవరకు కొవిడ్‌ లక్షణాలు ఉన్న ఎవరినైనా గుర్తించారా.. అని సిబ్బందిని ఆరా తీశారు. రైల్వే స్టేషన్‌ ముందు గార్డెనింగ్‌ ప నులు చేస్తుండగా అధికారులు వస్తున్నారంటేనే రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు.

అనంతరం రైల్వే రన్నింగ్‌ రూంను పరిశీలించి రైలు డ్రైవ ర్లు, గార్డులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. రూం రూఫ్‌ నుంచి నీరు లీకవుతుందని కార్మికులు తెలుపడంతో అక్కడ విధులు నిర్వర్తించే వారిని మరమ్మతులు చే యిం చాలని తెలువదా అని ప్రశ్నించారు. రైల్వే దవాఖానను తనిఖీ చేసి వైద్యపరంగా సమస్యలు ఉన్నాయా, ఇటీవల ఏర్పాటు చేసిన కొ విడ్‌ వార్డులో ఎంతమంది చికిత్స పొందారని ఆరా తీశారు. యార్డులో ఏఆర్‌టీ, ఎంఆర్‌వీ రైళ్లకు నూ తన పరిజ్ఞానంతో వచ్చిన పనిముట్లను పరిశీలించి, కార్మికుల పనితీనును చూ సి, పలు సూచనలు చేశారు. జనగామ రైల్వే స్టేషన్‌లో మూడో నంబర్‌ ప్లాట్‌ఫాం నిర్మాణం పూర్తి చేయడంతోపాటు రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపై బుకింగ్‌ కౌంటర్‌, కోచ్‌ డిస్‌ప్లే బోర్డులను త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

కొవిడ్‌ కారణం గా జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌  రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య 4000 నుంచి 1500 పడిపోయిందని డీఆర్‌ఎం తెలి పారు.స్టేషన్‌ మాస్టర్‌ గదితో పాటు ప్రయాణికుల వెయిటింగ్‌ హాల్‌, దివ్యాంగుల  టాయిలెట్స్‌, గూడ్సు వ్యాగన్‌ పాయింట్ల ను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో మూడో రైల్వే లైన్‌ నిర్మాణ పనుల శ్రీకా రం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో సీనియర్‌ డీఈఈఎం, సీనియర్‌ డీసీఎం బస్వరాజు, సీనియర్‌, అసిస్టెం ట్‌ డీఎస్‌టీఈలు రాజు, సంపత్‌కుమార్‌, డీవోఎం మణికు మార్‌తోపాటుగా స్థ్ధానిక రైల్వే అధికారులు, సీనియర్‌ డీఎం ఈ శ్రీనివాస్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, సీసీఐ రాజ్‌గో పాల్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌నాయక్‌, సీ అండ్‌ డబ్ల్ల్యూ ఇన్‌ చార్జి రామరాజు, సీసీసీ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo