సోమవారం 08 మార్చి 2021
Jangaon - Nov 07, 2020 , 04:57:47

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి : సీఐ

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి : సీఐ

జనగామ క్రైం, నవంబర్‌ 6 : ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి సంరక్షించాలని జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ కోరారు. ఎస్సై రాజేశ్‌నాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌ డే ట్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ పోలీస్‌ స్టేషన్‌లో మొక్క నాటారు. మల్లేశ్‌యాదవ్‌ మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటితే పర్యావరణ పరిరక్షణ సులభమవుతుందన్నారు. పేదల ఆకలితీర్చేందుకు కృషి చేస్తున్న బర్త్‌ డే ట్రీ ఫౌండేషన్‌ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మనోహర్‌, బర్త్‌ డే ట్రీ ఫౌండేషన్‌ సభ్యులు మంతెన మణి, మంగళంపల్లి రాజు, ఉమేశ్‌, తుంగ కౌశిక్‌, మద్దెల కార్తీక్‌, రొడ్డ కృష్ణ, వినోద్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo