శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Nov 06, 2020 , 01:58:27

రైతుల కోసమే కేసీఆర్‌ తపన

రైతుల కోసమే కేసీఆర్‌ తపన

  • దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ
  •  జనగామలాంటి కరువు నేలలోనూ  ధాన్యరాశులు
  •  పండిన ప్రతి గింజనూ కొంటాం
  • కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో   పంటలు కొనడం లేదు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో   ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దేవరుప్పుల, నవంబర్‌ 5: దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ నిలిచిందని, రైతు కోసమే కేసీఆర్‌ పడుతున్న తపనే దీనికంతటికి కారణమని పంచాయ తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభిం చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నేడు జనగామలాంటి నేలలోనూ ధాన్యరాశులు పండుతు న్నాయని అన్నారు. కోనసీమను తలపిస్తూ నిరంతరం వాగులు వంకలు పారుతున్నాయని, చెరువులు నిండు కుండల్లా తలపిస్తున్నాయని పేర్కొన్నారు. 365 రోజు లు కాల్వలు పారేలా కేసీఆర్‌ సాగునీటి ప్రణాళికలు రూపొందించారని అన్నారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశార ని వివరించారు. ప్రభుత్వం వానకాలంలో పండిన ప్రతి గింజా కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, కేసీ ఆర్‌ ఎన్ని ఆర్థిక కష్టాలనైనా ఓర్చి రైతుల నుంచి ధాన్యం సేకరించాలనే కృతనిశ్చ యంతో ఉన్నారని పేర్కొన్నారు. జనగామ జిల్లాలో 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, రైతులు పండించిన ప్రతి గింజా కొనాలని అధికారుల ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. హమాలీ, గన్నీ లు, ట్రాన్స్‌పోర్ట్‌ అన్నీ ముందస్తుగా ఏర్పాట్లు చేశామ న్నారు. రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా తాలు, తేమలే ని నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తేవడమేన ని మంత్రి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా టోకెన్‌ పద్ధతిలో ధాన్యం కొనాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు మరే రాష్ట్రంలోనూ ప్ర భుత్వాలు ధాన్యం కొనడం లేదని, ఇది టీఆర్‌ఎస్‌ ప్రభు త్వ పాలనకు నిదర్శనమన్నారు. కొనే ధాన్యాన్ని అవస రమైతే  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ చేయా లని, రైతుకు అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదే శించారు. సన్నబియ్యం రేటును కొంత పెంచే ఆలోచన లో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, ఈ విషయాన్ని మొన్న కొ డకండ్లలో జరిగిన సభలో తెలిపారని గుర్తు చేశారు. కా ర్యక్రమంలో స్థానిక పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల రమేశ్‌రె డ్డి, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవో మధుమోహ న్‌, డీఎస్వో రోజారాణి, డీసీవో మద్దిలేటి, డీఏవో న ర్సింగం, ఏడీఏ రాధిక, ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీ సీ పల్లా భార్గవి, జీసీసీ మాజీ చైర్మన్‌ గాంధీనాయక్‌, కొ డకండ్ల, పాలకుర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్లు పేరం రాము, రాంబాబు, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు ఈగల దయాకర్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ నక్క రమేశ్‌, డైరె క్టర్లు కొత్త జలేంధర్‌రెడ్డి,  సతీశ్‌, వేణు, కృష్ణమూర్తి, రవీంద ర్‌రెడ్డి, సత్తయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు జోగేశ్‌, మ హేశ్‌, సోమనర్సయ్య, సర్పంచ్‌లు మల్లేశ్‌, శ్రీనివాస రెడ్డి, సుజనారెడ్డి,  మండల నాయకులు పల్లా సుంద ర్రాంరెడ్డి, బస్వ మల్లేశ్‌, కొల్లూరు సోమయ్య, చింత రవి, కోతి పద్మ, లీనారెడ్డి, హనుమంతు పాల్గొన్నారు. 


VIDEOS

logo