ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Nov 04, 2020 , 01:44:36

కవితను కలిసిన జాగృతి జిల్లా అధ్యక్షుడు మురళి

కవితను కలిసిన జాగృతి జిల్లా అధ్యక్షుడు మురళి

జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్‌ 3 : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మంగళవారం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలో జాగృతి సేవా కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికపై కవితతో మాట్లాడారు. కవితకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనంతుల ఆంజనేయులు, ఐలేశ్‌కుమార్‌, శ్రీశైలం, కల్యాణ్‌ చక్రవర్తి ఉన్నారు.

ఎమ్మెల్సీ కవితకు చీరె బహూకరణ

కొడకండ్ల : ఇటీవల జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితను టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా కవితకు చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేసిన చీరెను బహూకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెలంగాణ సాయి, రాజు సాగర్‌, గౌసోద్దీన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo