సోమవారం 01 మార్చి 2021
Jangaon - Nov 04, 2020 , 01:44:36

పటాకుల దుకాణాలకు అనుమతి తీసుకోవాలి

పటాకుల దుకాణాలకు అనుమతి తీసుకోవాలి

జనగామ క్రైం, నవంబర్‌ 3 : దీపావళి పండుగ నేపథ్యంలో జనగామలో పటాకులు విక్రయాలు కొనసాగించాలనుకునే దుకాణాదారులు స్థానిక పోలీస్‌, రెవెన్యూ, పొల్యూషన్‌ డిపార్టుమెంట్‌ నుంచి అనుమతి పొందాలని జనగామ అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ అన్నారు. మంగవారం ఆయన ఒక ప్రకటన చేశారు. పటాకుల దుకాణాల కోసం సంబంధిత ప్రభుత్వ శాఖల పేరిట బ్యాంకులో చలాన చెల్లించాలని కోరారు. అనుమతి లేకుండా పటాకులు విక్రయించాలని ప్రయత్నిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మల్లేశ్‌యాదవ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతించిన, తక్కువ కాలుష్యరహితమైన దేశీయ పటాకులను మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు.

VIDEOS

logo