మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Nov 03, 2020 , 02:12:36

అంబరాన్నంటిన సంబురాలు

అంబరాన్నంటిన సంబురాలు

నెహ్రూపార్క్‌/ బచ్చన్నపేట/ నర్మెట/ దేవరుప్పుల/ తరిగొప్పుల/ జఫర్‌గడ్‌/ పాలకుర్తి రూరల్‌/ కొడకండ్ల/ చిలుపూర్‌, నవంబర్‌ 2 : జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ నిఖిల ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుకు పట్టాదారు పాస్‌బుక్‌ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ధరణితో రైతుల కష్టాలు తీరనున్నాయని అన్నారు. అరగంటలో భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఆర్‌ఐ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. బచ్చన్నపేటలోని తహసిల్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్లు చేశారు. కార్యక్రమంలో డీటీ విమల, ఆర్‌ఐ కృష్ణస్వామి పాల్గొన్నారు. నర్మెట లో తహసీల్దార్‌ రంగరాజు మురళీధర్‌రాజు , దేవరుప్పులలో తహసీల్దార్‌,  జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ స్వప్న ధరణిలో భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. తరిగొప్పులలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఫరీదొద్దీన్‌ పాల్గొన్నారు. జఫర్‌గడ్‌లో తహసీల్దార్‌ వీరస్వామి ధరణిలో భూములు రిజిస్ట్రేషన్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. పాలకుర్తిలో తహసీల్దార్‌ విజయభాస్కర్‌ మాట్లాడుతూ.. రైతుల పనులు పారదర్శకంగా జరుగుతాయన్నారు.  కార్యక్రమంలో డీటీ శ్రీనివాస్‌, సినియర్‌ అసిస్టెంట్‌ ఉమాదేవి, బుస్సారి శంకర్‌రావు, రైతులు కత్తుల యాకయ్య, ఎండీ వహీద్‌, జంపాల ఆంజయ్య పాల్గొన్నారు. కొడకండ్లలో తహసీల్దార్‌ యాకన్న ధరణి ప్రక్రియను ప్రారంభించారు.  చిలుపూర్‌లో తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డి ఇద్దరు రైతుల భూములకు రిజిస్ట్రేషన్‌ చేశారు. కార్యక్రమంలో డీటీ సూర్యనాయక్‌, ఆర్‌ఐ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo