శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Nov 01, 2020 , 04:50:17

ప్రతి గింజలో కేసీఆర్‌ ప్రతిబింబం

ప్రతి గింజలో కేసీఆర్‌ ప్రతిబింబం

  • దేశానికే ఆయన దిక్సూచి
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

జనగామ, నమస్తే తెలంగాణ : బతుకుదెరువు కోసం రక్తపుటేరులు పారిన తెలంగాణ నేలపై ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కృష్ణా, గోదావరి జలాలు పారించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొడకండ్ల రైతు వేదిక సభలో ఆయన మాట్లాడుతూ గాలి.. నీరు.. వెలుతురు ప్రకృతి ఇస్తే, అన్నం ఇచ్చే భగవంతుడే రైతన్న అన్నారు. ఏడు దశాబ్దాల కాలంలో వ్యవసాయ రంగాన్ని గత పాలకులు సంక్షోభంలోకి నెట్టి, రైతుల గోసను ఎవరూ పట్టించుకోలేదన్నారు. రైతులు ఇక వ్యవసాయం మానేద్దామనుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం పగ్గాలు చేపట్టి అన్నదాతల కోసం అనేక సంస్కరణలు, పథకాలతో దేశానికి దిక్సూచిగా నిలిచిన కారణజన్ముడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. రైతులకు ఒక వేదిక నిర్మించి, దాన్ని స్వయంగా ప్రారంభించి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా తెలంగాణ రైతును దేశానికే వెలుగు చూపించే దీపంగా మార్చారన్నారు. మన రైతులు చూపిన వెలుతురులోనే దేశంలోని రైతులంతా పయనించే రోజులు మనం భవిష్యత్‌లో చూడొచ్చన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో ఇక ఆకలి, వలసలు ఉండవన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు చరిత్రకు కొత్త నాంది పలుకుతాయన్నారు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో 1.45కోట్ల ఎకరాల పంటలు ఎటు చూసిన స్వాగతం పలుకుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పండే ప్రతి గింజలో కేసీఆర్‌ ప్రతిబింబం కనిపిస్తుందని తెలిపారు.

VIDEOS

logo