శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jangaon - Oct 29, 2020 , 02:03:28

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • ఎన్నికలో సమష్టిగా సాగుదాం
  • ఓటర్ల నమోదు వంద శాతం జరుగాలి
  • టీఆర్‌ఎస్‌ ముఖ్యుల కీలక సమావేశం
  • మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి  ఆధ్వర్యంలో ఓటర్ల నమోదుపై సుదీర్ఘ సమీక్ష

వరంగల్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని  పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి స త్యవతిరాథోడ్‌ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియపై మంత్రుల ఆధ్వర్యం లో హన్మకొండలోని హరిత హోటల్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావే శం జరిగింది. రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రా జేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యా దవరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానం దం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, జడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారా వు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్ల నమోదు, గెలుపు కోసం పార్టీపరంగా అమ లు చేయాల్సిన వ్యూహంపై చర్చించారు. 

ఈ సంద ర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అవుతుందని అన్నారు. వరం గల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభ ద్రుల ఎమ్మెల్సీలో భారీ ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి విజయం సాధించేలా కార్యాచరణ ఉండా లని అ న్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం వరంగల్‌ ఉమ్మ డి జిల్లా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించాలని ముఖ్య నేతలను కోరారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలే ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు శ్రీరామరక్ష అని అన్నారు. ఆలోచనాపరులైన గ్రా డ్యుయేట్లకు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచిం చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నదని పేర్కొన్నారు. ప్ర భుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను, తాజాగా తెచ్చిన చట్టాలను గ్రాడ్యుయేట్లకు అర్థమయ్యేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ఓటర్ల నమోదు లో పకడ్బందీగా వ్యవహరించాలని రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అర్హ లైన ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఓటర్లను నమోద య్యేలా చూడాలని చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదుపై సమీక్ష నిర్వహించారు. ద్వితీయ శ్రేణి నాయకులతో సమన్వయం చేసి గ్రామాల వారీగా గ్రాడ్యుయేట్ల ఓటర్ల నమోదు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.