ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Oct 29, 2020 , 02:03:28

కాళేశ్వరంలో అటవీ శాఖ పీసీసీఎఫ్‌

కాళేశ్వరంలో అటవీ శాఖ పీసీసీఎఫ్‌

కాళేశ్వరం/భూపాలపల్లి కలెక్టరేట్‌: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్‌ శోభ బుధవారం సా యంత్రం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శిం చుకున్నారు. ఈ మేరకు అర్చకులు, అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికా రు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి శర్మ ఆశీర్వచనం అందజే సి సీనియర్‌ సహాయకులు ఉమామహేశ్వరరావు అమ్మవారి శేష వస్ర్తాలతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. గురువారం జరుగను న్న అంతర్‌రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ స మన్వయ సమావేశంలో పాల్గొనడానికి చెల్పూరు టీఎస్‌ జెన్‌కో గెస్ట్‌హౌస్‌కు వచ్చిన రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రొయ్యూరు శోభకు జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ పూల బొకే తో స్వాగతం పలికారు. ఆమె వెంట సీసీఎఫ్‌ వరం గల్‌ సర్కిల్‌ ఎంజే అక్బర్‌, ట్రైనింగ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధి కారులు ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో కలెక్ట ర్‌తోపాటు జిల్లా అటవీ శాఖ అధికారి పురుషో త్తం, ఆర్డీవో శ్రీనివాస్‌, డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి వజ్రారెడ్డి, భూపాలపల్లి తహసీల్దార్‌ అశోక్‌ కుమా ర్‌, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.

VIDEOS

logo