ఓవర్ లోడ్‌తో ఇబ్బందే..

- మితిమీరిన వేగం.. నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు
- నిబంధనలు పాటిస్తేనే సేఫ్
ఖిలావరంగల్: వాహనాలను ఓవర్ లోడుతో నడుపడం నిబంధనలను ఉల్లంఘించడమే. ప్రయాణికులు, సరుకులను రవాణా చేసే ప్రతి వాహనంలో సామర్థ్ధ్యానికి మించి తరలిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఓవర్ లోడ్ తాత్కాలిక లాభమే కాని దీర్ఘకాలిక నష్టాలు, సమస్యలను తీసుకువ స్తుంది. మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ప్రమాదా ల బారిన పడండం ఒక కారణమైతే ఓవర్ లోడ్ మరో కార ణం. వీటితో వాహనాలు అదుపు తప్పడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు చోటు చేసుకోవడం నిరంతరం జరుగుతున్న సంఘ టనలను బట్టి తెలుస్తున్నది. టీఆర్ఎస్ సర్కారు అధికారం లోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్ర మాదాలను నివారించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. రవాణాశాఖతో పాటు వివిధ శాఖల అధికార యంత్రాంగం ప్రమాదాలు జరి గే స్థలాలను గుర్తించి ముందుస్తు చర్యలు తీసుకున్నప్పటికీ డ్రైవర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తనతోపాటు ప్రయాణికుల, ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబాల్లో నెలకొనే అత్యంత దుర్భర పరి స్థితులను చూస్తూ కూడా డ్రైవర్లలో మార్పు రావడం లేదనే ఆరోపణలున్నాయి. వాహన చోదకులు నిబంధనలు ఉల్లం ఘించడం, మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
ప్రమాదాల నివారణకు నియమ నిబంధనలను వెల్లడిస్తు న్న రవాణాశాఖ వాటిని ఉల్లంఘించిన వాహనదారులపై రవాణా శాఖ కన్నెర్ర చేస్తోంది. వాహన సామర్థ్యం మించిన సరుకులు రవాణా చేస్తూ అధికారులకు దొరికితే వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసి సమీపంలోని కార్యాలయానికి తరలి స్తారు. సాధారణ జరిమానా రూ. 2000 నుంచి రూ. 5 వేల తోపాటు వాహన సామర్థ్యానికి మించి ఎన్ని టన్నులు ఎక్కు వగా ఓవర్ లోడు ఉంటే టన్నుకు రూ.1000 చొప్పున అద నంగా రవాణాశాఖ అధికారులు జరిమానా విధిస్తారు. అలా గే డ్రైవర్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేస్తారు. అలాగే ప్రయాణికులను తరలించే వాహనాల్లో సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ కూర్చోబెట్టడం నేరం. ఎంత మంది ఎక్కువగా ఉంటే ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.3750తోపాటు అదనంగా రూ.5000 జరిమానా విధిస్తారు. షరతులతో కూడిన అను మతి పత్రం(పర్మిట్)ను అధికారులు రద్దు చేస్తారు.
మితిమీరిన వేగం గాలిలో దీపం లాంటిది
మితిమీరిన వేగం గాలిలో దీపం వంటింది. ఏ క్షణాన్నైనా ఆరిపోవచ్చు. రోడ్డు నిబంధనల మేరకు వాహనాన్ని నడుపాలి. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఓవర్ లోడు వల్ల రోడ్లు దెబ్బతింటాయి. వాహనం అదుపు తప్పుతుంది. ఫలితంగా ధన, ప్రాణ నష్టం జరుగు తుంది. ఓవర్ లోడు వల్ల కలిగే అనర్థాలను లారీ, అటో అడ్డాలు, ట్రావెల్స్ నిర్వాహకులకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తు న్నాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటు న్నాం.
-వీ నరేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, వరంగల్
నిబంధనలివే..
వాహన సామర్థ్యం మేరకు మాత్రమే ప్రయాణికులను గానీ లేదా సరుకులను రవాణా చేయాలి.
నిర్దేశించిన వేగంతోనే వాహనాన్ని నడుపాలి.
వాహనం నడిపేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించవద్దు.
ఎక్కడపడితే అక్కడ సైరన్, హారన్ వాడొద్దు.
వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి.
వాహనానికి సైడ్ ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఇండికేటర్ వేయాలి.
ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడుపాలి.
రాత్రి వేళల్లో లైట్లు, డిమ్ డిప్పర్ ఉపయోగించాలి.
రోడ్డు పరిసరాలకనుగుణంగా వాహన వేగాన్ని తగ్గిస్తూ నడుపాలి.
తాజావార్తలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు