బేమాన్ బీజేపీ

- ఉప ఎన్నికలో దొడ్డిదారిలో గెలిచేందుకు ఆ పార్టీ నేతలు నక్క జిత్తులు వేస్తున్నరు
- ఓడిపోతమన్న భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నరు
- పట్టుబడ్డ సొమ్మును పోలీసుల నుంచి లాక్కెళ్లడం బరితెగింపు కాదా?
- కమలం కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తున్నరు
- సీనియర్ నాయకులు, మేధావుల మండిపాటు
- రాజకీయ విలువలను దిగజార్చుతున్నారని ఆవేదన
- సోషల్ మీడియాలో విష ప్రచారంపైనా ఆగ్రహం
‘దుబ్బాక ఉప ఎన్నికల ఎట్లనన్న గెలువాల్నని బీజేపీ నక్క జిత్తులు ప్రదర్శిస్తున్నది. డిపాజిట్ సుతం దక్కదని తెలిసి దిగజారుడు రాజకీయం జేస్తున్నది. ఓడిపోతమని తెలిసే కమలం పార్టోళ్లు బరితెగించిన్రు. ఆ పార్టీ అభ్యర్థి సుట్టం ఇంట్ల డబ్బు పట్టువడ్డంక గుడ మాదిగాదని దొంగ మాటలు మాట్లాడుతున్రు. పోలీసులే డబ్బు తెచ్చిన్రని వాళ్లమీదికే గూండాల్లెక్క పోయి పైసలు గుంజుకున్నరంటె ఎంతకు తెగిచ్చిన్రో సూడున్రి’ అంటూ ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రముఖులు, మేధావులు మండిపడుతున్నారు. ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో నగదు పట్టుబడడం, దానిపై ఆ పార్టీ ఉల్టా నాటకానికి తెరతీయడంపై మంగళవారం ‘నమస్తే’తో మాట్లాడుతూ కమలం నేతలు రాజకీయ విలువలను దిగజార్చుతున్నారని ఆవేదన చెందారు. సోషల్ మీడియాలో విష ప్రచారంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజల మద్దతుతో గెలువాల్సిన ఎన్నికలో బీజేపీ ప్రలోభాలకు తెగబడ చూసిన తీరును అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ వాళ్లు తెచ్చిన డబ్బు కట్టలు దొరికినా.. ఎదురుదాడి చేస్తూ బుకాయించడాన్ని సీనియర్ రాజకీయ నేతలు, అధికారులు, విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ మొదటి నుంచీ అక్రమాలను, డబ్బును ప్రధానంగా వాడుకుంటున్నదని చెబుతున్నారు. సోమవారం దొరికిన డబ్బు కట్టల విషయంలో బీజేపీ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసేలా ఉందని మండిపడ్డారు. ఎన్నికల కోసం డబ్బు పంపిణీ చేయడమే నేరమైతే.. అధికారులు సీజ్చేసిన డబ్బును దౌర్జన్యంగా లాక్కెళ్లడం ఇంకా తీవ్రమైన చర్య అని ఇందుకు కఠిన శిక్ష తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో కమలం నేతలు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఏ రకంగానూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దు. డబ్బు, వస్తువులు, కానుకలు వంటివి ఏవైనా ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు బీజేపీ నేతలు డబ్బును దుబ్బాకకు తీసుకెళ్లగా అధికారులు సీజ్ చేయడం, ఆ పార్టీ నాయకులు దౌర్జన్యంతో వాటిని మళ్లీ లాక్కెళ్లడం ఈ స్థాయిలో నిబంధనల ఉల్లంఘన ఎప్పుడూ జరగలేదని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అంటే నీతికి చిరునామాగా చెప్పుకునే పరిస్థితి నుంచి ‘బేమాన్ బీజేపీ’ అనే స్థాయికి తెచ్చారని విమర్శిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బును దౌర్జన్యంతో తీసుకెళ్లడం అంటే బీజేపీ వాళ్లకు ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియపైనా గౌరవం లేదనేది స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నా రు. అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన బీజేపీ వాళ్లే ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపైనా ప్రజల్లో ముఖ్యం గా యువతలో తీవ్ర వ్యతిరేక స్పందన వస్తున్నది. వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారని ఇది పద్ధ తి కాదని హితవు పలుకుతున్నారు. మా ర్ఫింగ్ వీడి యోలతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుండడంపై మండిపడుతున్నారు. బీజేపీ అక్రమాలు, అడ్డగోలు రాజకీయాలకు బుద్ధి చెప్పేలా దుబ్బాక ప్రజల తీర్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
అప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి
మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి
మహబూబాబాద్ రూరల్ : బీజేపీ చేసేవన్నీ అసత్య ప్రచారాలని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం పద్ధతి కాదని హితవుపలికారు. దుబ్బాక ఎన్నికలో ఓడి పోతామనే భయంతోనే టీఆర్ఎస్పై ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడున్నారని, దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, మార్నేని వెంకన్న, గుండా రాజశేఖర్, మార్నేని రఘు పాల్గొన్నారు.
తప్పును కప్పి పుచ్చుకునేందుకే
దుబ్బాక ఉపఎన్నికలో తాను చేస్తున్న తప్పును కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తారు. ఫిర్యాదులు వస్తే ఏ పార్టీల వారినైనా తనిఖీ చేస్తారు. సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి.. వాటిని తారుమారు చేసేందుకే బీజేపీ నాటకాలు ఆడుతున్నది. రఘునందన్‌రావు డబ్బులు తనవేనని ఒప్పుకుని మళ్లీ కావని అబద్ధ్దాలు ఆడుతున్నాడు. ఓడిపోతామనే భయంతోనే అనేక కుట్రలు పన్నుతున్నారు. దుబ్బాక ప్రజలు వారికి గుణపాఠం చెప్తారు.
- బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు
చౌకబారు విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలి. ఏదైనా పార్టీపై ఫిర్యాదులు వస్తే అధికారులు తనిఖీ చేస్తారు. ఎవరి వద్ద డబ్బులు దొరికితే వారిపై చర్యలు తీసుకుంటారు తప్ప పార్టీలతో వారికి సంబంధం ఉండదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఇతర జిల్లాల నుంచి వచ్చి దుబ్బాకలో మకాం వేశారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం అక్కడి వారే ఉన్నారు.
- మార్నేని రవీందర్రావు, డీసీసీబీ చైర్మన్
తప్పించుకునే యత్నం
బీజేపీ డబ్బు కట్టలతో దొరికినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మరు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. డబ్బుతో ఓట్లు కొనాలని బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు.
- ఖాజా సిరాజుద్దీన్, డిప్యూటీ మేయర్, వరంగల్
నిందితులకు శిక్ష పడే అవకాశం
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 353 కింద శిక్ష పడుతుంది. దీనికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. 384 ప్రకారం ప్రభుత్వ అధికారి నుంచి సీజ్ చేసిన సొమ్మును బలవంతంగా లాక్కున్నందుకు మూడేళ్లు జైలు పాలవుతారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మరింత శిక్ష పడుతుంది.
- కూనూరు సురేశ్‌కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పరకాల
బీజేపీ ఓటమి ఖాయం..
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ఓటమి ఖాయం. అందుకే ఆ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. దొంగ దీక్షలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి హరీశ్‌రావు దుబ్బాకలో చేసిన అభివృద్ధితోనే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత భారీ మెజార్టీతో గెలుస్తారు. బీజేపీ ఎత్తులను దుబ్బాక ప్రజలు చిత్తు చేస్తారు.
- పుస్కూరి శ్రీనివాసరావు, జడ్పీ ఫ్లోర్‌లీడర్. జనగామ
చట్టాన్ని అతిక్రమిస్తున్నారు
బీజేపీ నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. ప్రజాబలం ఉన్న టీఆర్ఎస్పై ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. అంతేగాక పోలీసులపై కూడా తప్పుడు ఆరోపణలు చేయ డం సరికాదు. దీనివల్ల రానున్న రోజుల్లో కూడా ఎన్నికల కమిషన్, చట్టంపై ప్రజలకు గౌరవం తగ్గే ప్రమాదముంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా అధికారులకు సహకరించాలి.
- సీనియర్ జర్నలిస్ట్ అల్లమనేని మోహన్‌రావు
రాజ్యాంగబద్ధంగా గెలువాలి
ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా విజయం సాధిస్తేనే నిజమైన గెలుపు. నోట్ల కట్టలతో గెలువడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడడంతో గెలుపు కోసం అక్రమ మార్గం ఎంచుకున్నారనే అనుమానాలకు తావిస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు.
- గౌని ఐలయ్య, ఎన్డీ జిల్లా నాయకుడు, బయ్యారం
ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు
ఎన్నికలో అడ్డదారుల్లో గెలువాలనుకునేవారికి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు. నోట్ల కట్టలతో ఓటును కొనాలనుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం. దుబ్బాక ఎన్నికలో బీజేపీ అభ్యర్థి డబ్బు పంచాలని ప్రయత్నించడం వారి కుటిల బుద్ధికి నిదర్శనం. అలాంటి వారికి ప్రజలు తగిన శాస్తి చేస్తారు.
- షేక్ సోందు, టీఆర్ఎస్ నాయకుడు, బయ్యారం
భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు
ఎన్నికల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే వైఖరి సరి కాదు. రఘునందన్‌రావు అత్యంత కరడుగట్టిన వ్యక్తి. అతని దుశ్చర్యలకు ఇదొక ఉదాహరణ. కేంద్రం అండతో అడ్డదారిన డబ్బు పంచి గెలువాలనే ప్రయత్నం విఫలమైంది. అది సిగ్గు మాలిన చర్య. ప్రజాస్వామ్య పరి రక్షణ మనందరి బాధ్యత.
- పిల్లి సుధాకర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
ఓడిపోతామనే బీజేపీకి భయం
ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకున్నది. రఘునందన్‌రావుకు సంబంధించిన డబ్బు కానప్పడు ప్రచారం మధ్య నుంచి సిద్దిపేటకు ఎందుకు వెళ్లా డు. సాక్ష్యాధారాలను, వీడియో ఫుటేజీలను అధికారులు వెల్లడించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గూం డాల్‌లా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
- జోరిక రమేశ్, కార్పొరేటర్, 34వ డివిజన్
పోలీసులపై గూండాయిజం
పోలీసులపై బీజేపీ గూండాయిజం ప్రదర్శిస్తున్నది. డబ్బులతో దొరకడ మేకాక వాటిని ఎత్తుకెళ్లే ప్ర యత్నం చేసింది. పోలీసు లు తిరిగి స్వాధీనం చేసుకు న్న సమయంలో ఓ వీడియో తీసి అసత్యాలు ప్రచా రం చేస్తున్నది. దుబ్బాక ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల కుట్రలను తిప్పికొట్టాలి.
- కంజర్ల మనోజ్‌కుమార్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విజ్ఞత కోల్పోయిన నేతలు
దుబ్బాక ఎన్నికల్లో విజ్ఞత కోల్పోయి బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల అధికారులకు పట్టుబడి దౌర్జన్యంగా ఎదురుదాడి చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది.
- సీతారాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, తొర్రూరు
బీజేపీది దిగజారుడుతనం
దుబ్బాక ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ దిగజారి వ్యవహరిస్తున్నది. ఓటమి భయంతో లక్షలాది రూపా యలు వెదజల్లుతున్నది. ఎన్నికలో డబ్బు పంచేందుకు తెచ్చినట్లు నిరూపణ అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు మాట మారుస్తూ నాటకాలు ఆడుతున్నారు. పోలీసులు దీనిపై కఠినంగా వ్యవహరించాలి.
- క్యాతరాజు సాంబమూర్తి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, భూపాలపల్లి
గూండాల్లా ప్రవర్తిస్తున్నారు
బీజేపీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. పట్టుబడిన డబ్బును దౌర్జన్యంగా పోలీసుల చేతుల్లోంచి లాక్కెళ్లడం విడ్డూరం. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలువడం అసాధ్యం. పోలీసులు, ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- మేకల సంపత్ కుమార్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్, జంగేడు
ప్రచారం కోసమే డ్రామాలు
ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ డ్రామాలు చేస్తున్నది. పోలీసులు విడుదల చేసిన వీడియోను చూసి ఆ పార్టీ కార్యకర్తలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సిగ్గుచేటు. ఎన్ని వేషాలు వేసినా దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయం.
- నీరేటి సుధాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, నర్మెట
బీజేపీ పతనానికి తొలిమెట్టు
ప్రజా వ్యతిరేక విధానాలతో ఎన్నికలో డిపాజిట్ కోల్పోయి బీజేపీ పతనానికి దుబ్బాక తొలిమెట్టు అవుతుంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేక బీజేపీ కార్యకర్తలు పడుతున్న కష్టాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ కుటిల బుద్ధికి అక్కడి ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారు.
- ఆమెడపు కమలాకర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు, నర్మెట
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
దుబ్బాకలో బీజేపీ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉన్నది. ఎన్నిక ల్లో గెలుపు, ఓటములు సహజం. దానికి విరుద్ధంగా అ ధికారుల విధులను అడ్డుకోవడం హేయమైన చర్య. ఉ ప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే ఆ పార్టీ కార్యకర్తలు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
- మస్రగాని వినయ్‌కుమార్, ప్రముఖ న్యాయవాది, ములుగు
డిపాజిట్లు దక్కవనే
డబ్బుతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ పోలీసులే డబ్బు తెచ్చి తమ ఇండ్లలో ఉంచారని దుష్ప్రచారం చేస్తూ దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా బీజేపీ నాయకుల వ్యవహారం ఉన్నది. డిపాజిట్లు దక్కవనే ఉద్దేశంతో వారు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది. దానికి అధికార పార్టీకి వంతపాడాల్సిన అవసరం లేదు.
- శానబోయిన అశోక్, టీఆర్ఎస్కేవీ, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షుడు
బీజేపీ తీరు బట్టబయలైంది
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తీరు బట్టబయలైంది. అధికారుల సోదాల్లో డబ్బు దొరికితే పోలీసులే తెచ్చారని దుష్ప్రచారం చేయడం తగదు. వాటిని ఆ పార్టీ నాయకులే ఎత్తుకెళ్లారు. ఎన్నికలో పంచేందుకు డబ్బు సిద్ధం చేసుకున్నారనే సమాచారంతో అధికారులు దాడులు చేయడం తప్పా?. పైగా టీఆర్ఎస్పై నిందలు వేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి.
- బండి సందీప్, టీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట
ఉనికి కోసమే ఆరాటం
ఉనికి కోసమే బీజేపీ ఆరాట పడుతున్నది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిపాజిట్ గల్లంతవడం ఖాయం. కేంద్రం రాష్ర్టానికి రూపాయి కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప వారు రాష్ర్టానికి చేసింది శూన్యం. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష మెజార్టీతో గెలుస్తారు.
- నల్లా నాగిరెడ్డి, ఎంపీపీ, పాలకుర్తి
తాజావార్తలు
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
- చారిత్రాత్మకం ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం.. చరిత్రలో ఈరోజు
- మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !