శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jangaon - Oct 28, 2020 , 02:24:38

క్రమశిక్షణతోనే ఎదిగా

క్రమశిక్షణతోనే ఎదిగా

పరకాల టౌన్‌ : విద్యార్థి దశలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యమని, చిన్ననాటి క్రమశిక్షణతోనే నేడు ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో పట్టణంలోని సీఎస్‌ఐ పాఠశాల 1989-90 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో పాల్గొన్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చిన్న నాటి మిత్రులతో ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనాటి గురువులను సన్మానించడంతో పాటు నాటి జ్ఞాపకాలను తోటి మిత్రులతో కలిసి పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన నమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ అప్పట్లో గురువులు చదువు కంటే క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారన్నారు. వారు నేర్పిన క్రమశిక్షణతోనే చాలా మంది జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబడినట్లు తెలిపారు. 30 ఏండ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

స్వగ్రామం వరికోల్‌లో 7వ తరగతి వరకు చదువుకుని, ఉన్నత విద్య కోసం పరకాలలోని సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదుకున్నానని తెపారు. పుట్టిన ఊరు తల్లితో సమానమని, అందుకే రాష్ట్రంలోనే వరికోల్‌ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మోడల్‌గా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. పరకాల పట్టణ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పరకాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ కే వాసుదేవరెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొచ్చు వినయ్‌, పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌,  ఆనాటి  ప్రధానోపాధ్యాయుడు థామస్‌, ఉపాధ్యాయులు కోర్నెల్‌, నర్సింహరాములు, కార్యక్రమ నిర్వాహకులు రాజేశ్వరాచారి, నటరాజ్‌, అశోక్‌, శంకర్‌, రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు