సోమవారం 01 మార్చి 2021
Jangaon - Oct 28, 2020 , 02:24:38

అభివృద్ధి పనులు మూడ్రోజుల్లో పూర్తవ్వాలి

అభివృద్ధి పనులు మూడ్రోజుల్లో పూర్తవ్వాలి

కొడకండ్ల, అక్టోబర్‌ 27 : అభివృద్ధి పనుల్లో కొడకండ్ల రోల్‌మోడల్‌గా నిలిచి జిల్లాలోనే ముందంజలో ఉండాలని కలెక్టర్‌ నిఖిల కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక, పల్లెప్రకృతి వనం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులతో పాటు సీఎం పర్యటన కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతువేదిక, పల్లెపకృతివనం నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నిఖిల కోరారు. రైతువేదిక చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆమె సూచించారు. పల్లెప్రకృతి వనాన్ని సుందరంగా మార్చాలని, మొక్కలను నాటి హరితశోభను సంతరింపజేయాలని అ న్నారు. 

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. కొడకండ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మిగిలి ఉన్న పనుల్లో వేగం పెంచి పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, ఈఈలు దామోదర్‌రావు, రఘువీరారెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌ గాంధీనాయక్‌, ఎంపీపీ జ్యోతిరవీంద్రగాంధీనాయక్‌, ఎంపీడీవో డాక్టర్‌ రమేశ్‌, వ్యవసాయ శాఖ ఏడీఏ రాధిక, సర్పంచ్‌ మధుసూదన్‌, పంచాయతీరాజ్‌ ఏఈ కిరణ్‌కుమార్‌, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ దూలం సతీశ్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ రమే శ్‌, నాయకులు వెంకటనారాయణ, దేశగాని సతీశ్‌గౌడ్‌, తాళ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo