శనివారం 05 డిసెంబర్ 2020
Jangaon - Oct 27, 2020 , 01:46:32

తిమ్మంపేట గ్రామాభివృద్ధికి సహకరించాలి

తిమ్మంపేట గ్రామాభివృద్ధికి సహకరించాలి

జఫర్‌గఢ్‌, అక్టోబర్‌ 26 : మండలంలోని తిమ్మంపేట గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జడ్పీటీసీ ఇల్లందుల బేబీ కోరారు. ఈ మేరకు సోమవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో తిమ్మంపేట గ్రామస్తులతో కలిసి ఆమె రాజయ్యను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. తిమ్మంపేట గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాజయ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అంబేద్కర్‌ కమ్యూనిటీ హాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని బేబీ కోరారు. దీనికి ఎమ్మెల్యే రాజయ్య సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట సర్పంచ్‌ మంద మల్లేశం, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఇల్లందుల శ్రీనివాస్‌, నాయకులు జోగు స్వామి, కొమురయ్య, యాదగిరి, రమేశ్‌, సంతోష్‌, విజయ్‌, అశోక్‌, యాదగిరి తదితరులున్నారు.