శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jangaon - Oct 25, 2020 , 02:15:18

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

పాలకుర్తి, అక్టోబర్‌ 24 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మండలంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం, శాంతినగర్‌, గౌడకాలనీ, గ్రామపంచాయతీ సమీపంలోని మండపాల వద్ద దుర్గామాత విగ్రహాలకు శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీదుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం వేదపండితులు   భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

వైభవంగా శరత్కాల మహోత్సవాలు

కొడకండ్ల : మండల కేంద్రంలోని యోగలింగేశ్వర సహిత రాజరాజేశ్వరీ ఆలయంలో శరత్కాల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం వేదపండితుడు పాలకుర్తి గౌతంశర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు కొనసాగించారు. పురాతన శివాలయంలో దుర్గామాత నవరాత్రోత్సవాల్లో భాగంగా  పూజారి పిండిప్రోలు నాగదక్షిణ మూర్తి ఆధ్వర్యంలో పూజలు చేశారు. 

తాజావార్తలు