ఆదివారం 17 జనవరి 2021
Jangaon - Oct 24, 2020 , 01:43:42

సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి

పాలకుర్తి రూరల్‌, అక్టోబర్‌ 23 : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు అన్నారు. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె వివరించారు. శుక్రవారం మండల కేంద్రంలో మిషన్‌ భగీరథ వాటర్‌ట్యాంక్‌ నిర్మాణానికి ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావుతో కలిసి ఉషాదయాకర్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలోనే పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్రామాలాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనలోనే పండుగలకు గుర్తింపు

సీఎం కేసీఆర్‌ పాలనలోనే పండుగలకు గుర్తింపు లభించిందని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని తీగారంలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, గ్రామసభ వేదికను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోనే బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అన్నారు. కరోనా నేపథ్యంలో బతుకమ్మను ఆడబిడ్డలు నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. కరోనా బాధితులకు ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులతో పాటు నియోజకవర్గంలో రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్‌భగీరథ డీఈ సంధ్యారాణి, ఏఈ ప్రశాంతి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొబ్బల అశోక్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, ప్రధాన కార్యదర్శి జర్పుల బాలునాయక్‌, తీగారం సర్పంచ్‌ పోగు రాజేశ్వరి శ్రీనివాస్‌, జడ్పీ, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ మదార్‌, ఎండీ సర్వర్‌ఖాన్‌, రాపా క అశోక్‌, కటారి పాపారావు, సలే ంద్ర రమ, ఎంపీటీసీలు ఎడవెల్లి పు రుషోత్తం, కమ్మగాని పుష్పలీల, బెల్లి సోమయ్య, ఉప సర్పంచ్‌ తరాల చంద్రబాబు, మొగుళ్ల కుమార్‌, వార్డు సభ్యులు మూల రమాదేవి, వీరమనేని హనుమంతరావు, బండి కిరణ్‌, మామిండ్ల యాదగిరి, బెల్లి అనిత, గాదెపాక ఎల్లయ్య, శివరాత్రి సోమయ్య, యాదగిరి, కమ్మగాని నాగన్న, కడుదుల కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.