ఆదివారం 24 జనవరి 2021
Jangaon - Oct 24, 2020 , 01:38:44

అంకితభావంతో పనిచేసే వారికే గుర్తింపు

అంకితభావంతో పనిచేసే వారికే గుర్తింపు

బచ్చన్నపేట, అక్టోబర్‌ 23 : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాల్లో ఇళ్లతోపాటు ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసిన ఎంపీడీవో రఘురామకృష్ణతోపాటు గ్రామ కార్యదర్శులను శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ అన్‌లైన్‌ ప్రక్రియను అన్ని గ్రామాల్లో సకాలంలో పూర్తి చేయడంతో అభినందనలు తెలిపి రూ.2 వేల చొప్పున పారితోషికం అందజేశారు. 

దేవరుప్పులలో..

దేవరుప్పుల : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు కృషి చేయడంవల్లే ఇళ్లతోపాటు ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ సకాలంలో పూర్తయిందని అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటు ఎంపీపీ బస్వ సావిత్రి, ఎంపీడీవో అనిత గ్రామ కార్యదర్శులకు రూ.2 వేల చొప్పున పారితోషికం అందజేసి సన్మానించారు. అనంతరం అబ్దుల్‌ హమీద్‌ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నా గ్రామకార్యదర్శులు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాలకు వెళ్లి ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయడంపై కలెక్టర్‌ తరుఫున ధన్యవాదాలు తెలిపారు. 

పాలకుర్తిలో..

పాలకుర్తి రూరల్‌ : ఇళ్లతోపాటు ఆస్తుల ఆన్‌లైన్‌ను సకాలంలో పూర్తి చేసిన గ్రామ కార్యదర్శులను శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు రూ. 2 వేల నగదు ప్రోత్సా హం అందించామన్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్‌, సీఐ బానోత్‌ రమేశ్‌నాయక్‌, ఎంపీవో దయాకర్‌, సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

నర్మెటలో..

నర్మెట : ఇళ్లతోపాటు ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో పం చాయతీ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేశారని జిల్లా పరిషత్‌ సీఈవో రమాదేవి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు రూ.2 వేల చొప్పున చెక్కులు అందజేసి సన్మానించారు. ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ నిఖిల ఆదేశాల మేరకు సర్వేను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజామొయినొద్దీన్‌, ఎంపీవో గఫూర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

జఫర్‌గఢ్‌లో..

జఫర్‌గఢ్‌ : కలెక్టర్‌ నిఖిల ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సన్మానించారు. ఎంపీపీ రడపాక సుదర్శన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, డీఆర్‌డీవో రాంరెడ్డి ముఖ్యఅతిథులు పాల్గొని మాట్లాడారు. ఆస్తుల ఆన్‌లైన్‌ను సకాలం నిర్వహించినందుకు రూ.2 వేల చొప్పున పారితోషికాన్ని గ్రామకార్యదర్శులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కొడకండ్లలో..

కొడకండ్ల : మండలంలోని గ్రామకార్యదర్శులతోపాటు ఎంపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్లను  శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి సన్మానించారు. ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొన్న వారికి రూ.2 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ దైవాదీనం, ఎంపీవో హరిబాబు, ఏపీవో కుమారస్వామి పాల్గొన్నారు. 

అధికారులను సన్మానించిన కలెక్టర్‌

జనగామ రూరల్‌ : ఆస్తుల ఆన్‌లైన్‌లో మెరుగైన సేవలందించిన ఎంపీడీవో ఉప్పుగల్లు సంపత్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్‌ నిఖిల శుక్రవారం సన్మానించారు. జనగామలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆన్‌లైన్‌ సర్వేను గడుడులోపు పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు.ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిఖిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, అధికారులు  పాల్గొన్నారు. 

లింగాలఘనపురంలో..

లింగాలఘనపురం : మండలంలోని పంచాయతీ కార్య దర్శులను ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, ఎంపీపీ చిట్లజయశ్రీ సన్మానించారు. ఎంపీవో మల్లికార్జున్‌, 18 మంది కార్య దర్శులను శాలవాలతో సత్కరించి, రూ.2 వేల చొప్పున పారితోషికాన్ని అందించారు.  


logo