సోమవారం 30 నవంబర్ 2020
Jangaon - Oct 23, 2020 , 02:44:00

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌,అక్టోబర్‌ 22 : అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాల ని పట్టభద్రుల ఓటరు నమోదు ఇన్‌చార్జి మాచర్ల గణేశ్‌ అన్నారు. పార్టీలకతీతంగా, అన్ని వర్గాలను ఆదుకునేందుకు సీఎం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చేందుకు పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకునేలా కృషి చేస్తున్నారన్నారు. మండలంలోని తానేదార్‌పల్లి, విశ్వనాథపురం, చంద్రుతండాలకు చెందిన 42 మంది పట్టభద్రుల ఓటరు నమోదును ఆన్‌లైన్‌ చేసి  పార్టీ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌కు పత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ‘కుడా’ డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, సర్పం చ్‌ ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ గట్టు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిలుపూర్‌: మండలంలోని చిన్నపెండ్యాలలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పత్రాలను జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి చిన్నపెండ్యాల పట్టభద్రుల నుంచి స్వీకరించారు.  కార్యక్య్రమంలో  సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ జనగాం యాదగిరి, నాయకులు సుదర్శన్‌, మాజీ సర్పంచ్‌ సమ్మయ్య, దామోదర్‌  పాల్గొన్నారు.