పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలి

జనగామ, అక్టోబర్ 22 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన ల నేపథ్యంలో బతుకమ్మ పండుగను మహిళలు నిరాడంబరంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున అన్నారు. మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ యాదవ్, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు మసిఉర్ రహమాన్‌తో కలిసి మున్సిపాలిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సద్దుల బతుకమ్మకు అధికారికంగా ఏర్పాట్లు చేపట్టడం లేదన్నారు. వార్డుల వారీగా ఎవరికి వారే ఆటలు ఆడుకోవాలి తప్ప, సమూహంగా ఒకచోట చేరొవద్దన్నారు. బతుకమ్మ ఆడిన తర్వాత, కులాయిలు, కుంటలతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుంతల్లో బతుకమ్మను నిమజ్జనం చేసుకోవాలన్నారు. మరుసటి రోజు ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేస్తుందని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, కొవిడ్ నిబంధనల మేరకు పండుగ జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకునేలా చూడాలని సమావేశంలో పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, వాటర్ ప్లాంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉల్లెంగుల నర్సింగ్ కోరారు.
తాజావార్తలు
- ఆ సినిమాలతో విజయ్ సేతుపతి ఇమేజ్ బలైపోతుందా!
- టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
- ఏనుగుకు ప్యాంట్, షర్ట్ వేస్తే ఎలా ఉంటదో చూశారా?
- పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?
- పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక
- ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్